23/10/2015
Good morning
కురుక్షేత్రానికి ముందు ఓ అద్భుత దృశ్యం. నా సైన్యం… గజతురగ పదాతి దళాలన్నీ నీకు సాయంగా వస్తాయ్. నేను మాత్రం అర్జునుడి వైపు ఉంటాను రథ సారథిగా అంటాడు శ్రీ కృష్ణుడు. ఆలమందలతో ఆలుమందలతో అలిసిన కృష్ణుడొక్కడు లేకపోతే ఏమైంది… ద్వారక బలగం మనవైపు ఉండగా అనుకుంటాడు దుర్యోధనుడు. తర్వాత యుద్ధభూమిలో తెలుస్తుంది ఆ ఒక్కడే సైన్యసాగరమంత ప్రభావం చూపడగలడని ! సరిగ్గా ఏపీ విషయంలోనూ ఇంతే ! కేంద్ర ప్రభుత్వ సంస్థలు… రాజధాని… వేల కోట్ల ఆస్తులు… అపూర్వ కట్టడాలు… అన్నీ హైద్రాబాద్ తో పాటు తెలంగాణలోనే మిగిలిపోయాయ్. అంత నిరాశలోనూ ఒక్కటే ఆశ. ఒక్కడి మీదే ఆశ. ఒక్కడున్నాడన్న భరోసా! బాబు ఉన్నాడు..చూసుకుంటాడు !
ఎస్… హమారే పాస్…
రాజధాని లేదు. ఆదాయం లేదు… పాతాళంలా కనిపించే రెవిన్యూ లోటుంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏపీని కట్టుబట్టలతో సముద్రం ఒడ్డున ఇసక పర్రల్లో వదిలేసింది కేంద్రం. భవిష్యత్ ఏంటో తెలియదు… అరవై ఏళ్ల కుశల ప్రయాణం తర్వాత మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాలన్న ఆలోచనతోనే గుండె చెరువైపోతున్న సమయంలో దొరికిన ధైర్యం…చిక్కిన స్థైర్యం… చంద్రబాబు. పొడగ్తలా అనిపించినా..అగడ్తలా కనిపించినా వాస్తవం ఇదే ! వర్తమానం ఇదే ! భవిష్యత్ కూడా ఇదే ! దిక్కూదివాణంలేని రాష్ట్రంలో దుక్కిదున్నడం మొదలైపోయింది. ఆలోచనల విత్తులు జల్లి, మొక్కలు పెంచి వృక్షాలుగా మలచడమే మిగిలింది. ఆ పని ఆల్రెడీ జరుగుతోంది.
15 నెలల్లో ఏపీ ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందో తెలిస్తే అర్థమైపోతుంది చంద్రబాబు ఎఫెక్ట్ ఎంతో ! ఏపీకి అండ ఎంతో ! మొదట డబ్బు లెక్క చూద్దాం ! మేకిన్ ఇండియా స్లోగన్ ఇచ్చాక… ఇప్పటి వరకూ దేశంలోకి లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయని అంచనా ! అందులో దాదాపు నలభై వేల కోట్లు ఒక్క ఏపీకే ఖరారయ్యాయ్. ఇది మోడీ కూడా ఆశ్చర్యపోతున్న వాస్తవం. చైనా నుంచి జపాన్, సింగపూర్ ల నుంచి… జర్మనీ నుంచి. అమెరికా సంస్థల నుంచి… గల్ఫ్ నుంచి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలాచోట్ల నుంచే ఒప్పందాలు ఖరారయ్యాయ్. కొన్ని చోట్ల పనులు కూడా మొదలయ్యాయ్. మోడీ విదేశీ టుూర్లలో ఓమూడు చోట్ల ఇలాంటి అనుభవం ఎదురైంది. ఓసారి చైనాలో వాణిజ్యసదస్సులో మాట్లాడుతుండగా మీ దేశంలో మేం పెట్టుబడులు పెడ్తున్నాం అని చెప్పింది ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారుచేసే కంపెనీ. మీరు చెప్పిన పాలసీ కన్నా ఇంకాస్త మెరుగ్గానే ఉంది అక్కడ విధానం. ఏపీలో దిగుతున్నాం మేము అనే సరికి… ఓహో మీరు టచ్ లోనే ఉన్నారటన్నమాట… వెల్ కమ్ వెల్ కమ్