18/11/2025
ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పైరసి నీ అరికట్టాం అనుకోవడం ఎలా వుంది అంటే టిక్ టాక్ ని బ్యాన్ చేసి చైనా ని ఓడించాం అనుకున్నట్టు వుంది..😄
ఐబొమ్మ వలన నష్టం సినీ ఇండస్ట్రీ కా?
OTT యాప్స్ కా?
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కష్టాలుపడి ఒక సినిమా నిర్మించి ధియేటర్లో రిలీజ్ చేసిన వెంటనే అది ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చేస్తే ఆ మూవీ నిర్మించినవారికి చాలా నష్టం వస్తుంది..దీనినే పైరసి అంటారు.. ఇలా పైరసి చేయడం ఖచ్చితంగా నేరం..
కానీ ఐబొమ్మ లో వచ్చే సినిమాలు ధియేటర్లో రిలీజ్ అయిన వెంటనే వచ్చేవి కావు..
నాకు తెలిసినంతవరకు ధియేటర్లో రిలీజ్ అయ్యి కలెక్షన్లు సంపాదించుకుని కొన్ని రోజుల తరువాత సాటిలైట్ రైట్స్ ఏదో ఒక OTT యాప్ కి అమ్ముకుని ఆ డబ్బులు కూడా నిర్మాత తీసుకున్నాక ఆఫీషియల్ గా OTT లో రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే ఐబొమ్మ లో దర్శనం ఇస్తాయి..
దీని వలన నష్టం అంటూ ఉంటే అది కేవలం ఆ OTT యాప్ వారికే తప్పా సినిమా ఇండస్ట్రీ కి కాదు..
ఒకవేళ OTT లో కూడా కలెక్షన్ షేర్ నిర్మాతకి ఉంటే అప్పుడు అది సినీ నిర్మాతకి నష్టమే..
కానీ ఈ OTT రైట్స్ ఒక అమౌంట్ కి ఒకేసారి అమ్మేస్తారు కనుక ఇక ఆ సినిమా OTT యాప్ లో ఉన్నా.. ఐబొమ్మ లో ఉన్నా సినీ నిర్మాతకి నష్టం లేదు..
ఒకవేళ OTT వారి కోణంలో ఐబొమ్మ చేసింది తప్పే కావొచ్చు..
కానీ చాలా OTT యాప్ లు SUBSCRIPTION కి ముందుగా ఒక రేటు పెడుతున్నారు.. అది మనం పే చేసి లోపలికి వెళ్ళాక కూడా ఆ యాప్ లో మనకి నచ్చిన సినిమా చూడటానికి లేదు.. మంచి సినిమాలన్నీ రెంట్ కి పెడుతున్నారు.. లేదా upgrade చేసుకోమని మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు.. ఈ మధ్య యాడ్స్ వేస్తున్నారు.. అవి వద్దు అనుకుంటే మళ్ళీ డబ్బులు కట్టమంటున్నారు..ఇది కూడా దోపిడీయే కదా?మోసమే కదా..
ఐబొమ్మ చేసింది తప్పే అయితే OTT యాప్స్ చేసేది కూడా తప్పే కదా..
అసలు రిలీజ్ సినిమాలు దెబ్బ తినేది మూవీ రూల్జ్ వంటి యాప్స్ తో.. ఎందుకంటే సినిమాధియేటర్లో రిలీజ్ ఆయిన నిముషాల్లో ఇందులోకి వచ్చేసి కలెక్షన్స్ పడిపోవడానికి కారణం అవుతున్నాయి..వీలయితే వాళ్ళను అడ్డుకోండి..
సరైన లాయర్ ఉంటే ఐబొమ్మ నిర్వాహకుడు సింపుల్ గా బయటకి వచ్చేస్తాడు..
కానీ అతని వలన పేదలకు తక్కువ ధరకే వినోదం దక్కింది అనడం మాత్రం నిజం..
ఈ నష్టం కేవలం OTT యాప్స్ కే తప్పా సినిమా ఇండస్ట్రీ కి మాత్రం కానే కాదు..
ఇట్లు,
మీ,
రాజేష్ మహాసేన..