15/01/2026
సర్వ జీవ సుఖినోభవంతు
స్వచ్ఛమైన ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు
మానవ భౌతిక శరీరం నిత్య ఆరోగ్యముగా, ఆనందముగా, సుఖ శాంతులతో ఆత్మ శుద్ధి కలగలంటే ఏజీవిని హింసించరాదు, భక్షించరాదు.
ప్రతి ఒక్కరు పని చెయ్యాలి పని చేయలేని ( కేవలం ధనం, అధికారం కోసం కాదు ధర్మం కోసం మాత్రమే ) పరిస్థితులలో ఉన్న వారికి మరియు సర్వ జీవకోటికి స్వచ్చంధ సేవ అందించాలి.
ఏ జీవికి హాని, కీడు జరిగే వ్యాపారాలు, పనులు చేయరాదు.
ప్రియమైన మిత్రమా మీరు ఏ ఆపదలో ఉన్న, ఎ సమస్యలలో ఉన్న నీ చుట్టూ ఎందరో దైవ స్వరూపులు, మహాత్ములు ఉన్నారు, సేవ సంస్థలు ఉన్నాయి వారితో మీరు కష్ట నష్టాలు పంచుకుని సంతోషముగా బ్రతకాలి(మానవ జన్మ పవిత్రమైనది పాడుచేసుకోరాదు ) మీ చుట్టూ ఎవరు లేకపోతే జ్యోతి రామ్ ఫౌండేషన్ ను సంప్రదించండి.
దైవ ఆత్మలు కలిగిన సర్వ జీవ కోటి నిత్యం సుఖ శాంతులతో బ్రతుకుతూ చాటి జీవులను బ్రతికిస్తూ సర్వ దైవ జీవకోటి ఆత్మీయలతో సృష్టి నిత్యం అందముగా, ఆనందముగా, ఆరోగ్యముగా ఉండాలి అని పరమాత్మను మరియు సర్వ దైవ ఆత్మలను ప్రార్థిస్తూ, ఈ ఆత్మ కలిగిన జీవినైన నానుండి నిత్యం శుభకర్మలు, కార్యక్రమాలు జరగాలని, విశ్వంలో మానవుడు నిత్య సేవకుడుగా ఉండాలి అని ప్రార్థన.
ఆత్మ జ్ఞాన విద్యయే సర్వ సృష్టికి వెలుగు
ఈ సృష్టిలోకి ఆత్మతో వచ్చిన సర్వ జీవ కోటి నిత్యం ఆరోగ్యముగా, ఆనందముగా సహజ ప్రకృతి వడిలో బ్రతుకుతూ, బ్రతికిస్తూ ప్రస్తుత ప్రపంచాన్ని సర్వ దైవ లోకముగా ఉంచాలంటే స్వచ్ఛమైన ఆత్మ జ్ఞాన విద్య ప్రతి మనిషికి అవసరము.
ఆత్మ జ్ఞాన విద్యను ఎలా నేర్చుకోవాలి?
ప్రస్తుత పరిస్థితులలో పవిత్రమైన ఆత్మ జ్ఞాన విద్య గురువులు నుండి నేర్చుకోవడం కష్టమే ఐన, చాల సులువుగా ఎవరికివారు నేర్చుకోవచ్చు.
ఎలా?
నీ చుట్టూ ఉన్న సర్వ భౌతిక వస్తువులు, జీవులును గమనిస్తూ జరుగుతున్నా మార్పులే భౌతిక మాయ, ఈ మాయ లొంచి బయటికి రావడమే ఆత్మ జ్ఞానము. కనిపించేది సర్వం అసత్యం, అధర్మం,. కనిపించినది సర్వం సత్యం, ధర్మం ఇదియే ఆత్మ జ్ఞానము.
భౌతికమైన జీవ రూపం ఎందుకొచ్చింది?
ఈ అనంతమైన విశ్వములో అనంతమైన జ్ఞానము ఉంది ఇది తెలుసుకోవడానికి ఈ జీవ ప్రయాణము మరణములేని ఆత్మతో ఆత్మ శుద్ధి చేసుకుని పరమాత్మని చేరడానికి.
ప్రియమైన మిత్రమా! ఈ సందేశం నీ కోసం, నీ చుట్టూ ఉన్న ఆత్మ జీవకోటి కోసం గమనించి, గ్రహించి, నిత్య లోక కల్యాణనికై స్వచ్ఛమైన, స్వచ్చందమైన విద్య, వైద్యం, ఉపాధి.... మొదలగు అనేక ఆత్మ సేవ కార్యక్రమాలకు సంప్రదించండి.
ఈ సందేశం చదివి, చదివించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని జ్యోతి రామ్ ఫౌండేషన్ కు పంపండి వారివారి అభిప్రాయాలు, పరిస్థితులు భట్టి సేవలు అందుతాయి. ఫోన్. 9848842541,7989916538.
ధన్యవాదములు
జ్యోతి రామ్ ఫౌండేషన్