31/07/2024
https://youtu.be/bD-guM9lD6c?si=rxEoRB68B9kG4LNu
*Please Watch Full Video and subscribe our vtv telangana news channel*
*వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన*
మలక్పేట్ లోని విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ పసారం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆదివారం వీరశైవ లింగాయత్ /జంగమ మహేశ్వరుల జాతీయ స్థాయి వధూ వరుల
వివాహ పరిచయ వేదిక మలక్పేట్ శుభకరి ఫంక్షన్ హాల్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.
పూజ్య శ్రీ స్వాములు శ్రీ విశ్వనాథం స్వామి గారు , నాగయ్య స్వామి గారు , జగదీశ్ స్వామి గార్ల చే పూజ కార్యక్రమం నిర్వహించి ..వేదికకు హాజరైన వారికీ ఆశీర్వాదాలు ఇవ్వగా....
వివాహ పరిచయ వేదిక ఎంతో ఆహ్లాదభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివాహం కావలిసిన వధూ వరులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుండి వదు వరులు. వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇమ్మడి శిరీష చక్కని వాక్యత చేశారు.
ఈ పరిచయ వేదికకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొగాకు రుద్రమాదేవి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్, కొంక రాజేశ్వర్, వాలి బస్వరాజ్, కోట గుండప్ప, బండపల్లి శివ శరణప్ప , శెట్టి విజయకుమార్, చింది బద్రీనాథ్, అరుణ్ రాజ్ శేరికార్, వేపూరి రాజేష్,
బెత్తాల శ్రీనివాస్, నవీన్ కుమార్, బద్రీనాథ్, శెట్టి విజయ్ కుమార్,సంకూరి కుమారస్వామి , విజయరాం , అస్కుల నవీన్ , ప్రకాష్ , శంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరిచయ వేదికకు విశేష స్పందన లభించిందన్నారు.
ఇలాంటి ఒక వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి ఎంతోమంది వధూవరులను జంటగా కలుపుతున్న ఈ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ శ్రీనివాస్ ని అభినందించారు.
ఈ మ్యారేజ్ బ్యూరో ఇలాగే మరిన్ని జంటలను కలపాలని ఆకాంక్షించారు. అనంతరం పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు జరిగిన వివాహ పరిచయ వేదికలో వివాహం కావలసిన వధూవరులు తమ తల్లిదండ్రులతో పాల్గొన్నారని, అక్కడ వారి వారి అభిప్రాయాలు తెలియజేశారని అన్నారు. అందులో సుమారు 45 కు పైగా అక్కడే మాట ముచ్చట అయ్యిందని తప్పకుండా అవి కుదూరుతాయి అని ఈ వివాహ పరిచయ వేదిక లో పాల్గొన్న వదువరులకు తగిన సంబంధాలతో పెళ్లిళు జరగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో, విశ్వలింగాయత్ ట్రస్ట్ తరుపున పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.