ఆంధ్రప్రదేశ్ BC సమన్వయ కమిటీ

  • Home
  • India
  • Bhongir
  • ఆంధ్రప్రదేశ్ BC సమన్వయ కమిటీ

ఆంధ్రప్రదేశ్ 
BC సమన్వయ కమిటీ BC समन्वय समिति
BC coordinate committee

 out to my newest followers! Excited to have you onboard! Sanjay Siganiya, Kamal Soan, Jayasingh Saroota, Sunil Verma, V...
22/11/2025

out to my newest followers! Excited to have you onboard! Sanjay Siganiya, Kamal Soan, Jayasingh Saroota, Sunil Verma, Vishal Ambedkar, Menoka Narzary, Birendar Singh, Ravindra Narayan, Imran Shah Imran Shah, Papamiya Shaikh, Manisha Raj, Ramesh Kumar, Dalpartap Singh Marabee Ji, Kaushal Kumar, Shantosh Paswan, Gulab Kumar, Mohanlal Kushwaha, Santosh Kumar, Palash Halder

26/10/2025
20/10/2025

బుద్ధుడు అతని శిష్యులతో 18 సంవత్సరాల తర్వాత తిరిగి కపిలవస్తు రాజ్యానికి వస్తున్న సందర్భంగా అక్కడి ప్రజలు వెలిగించిన దీపాలతో పలికిన స్వాగతమే💥 "దీపావళి" 💥విజ్ఞానం, సమాజ శ్రేయస్సే పునాదిగా నిర్మించబడ్డ బౌద్ధమతని తిరిగి నిర్మిద్దాం.... బౌద్ధ దీపావళి శుభాకాంక్షలు💥💥

Jai bheem 🔥✊🐘
11/10/2025

Jai bheem 🔥✊🐘

03/10/2025

*బహుజన్ సమాజ్ పార్టీ, ఆంధ్రప్రదేశ్*

💐*సర్క్యులర్*💐
----------------------

*అందరికీ జై భీమ్*,
బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్ మాయావతి గారి ఆదేశానుసారం మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 19వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి రాష్ట్ర కమిటీ సభ్యుడు 10 ఫ్లెక్సీలు, జిల్లా కమిటీ సభ్యులు అందరూ కలిపి 20 ఫ్లెక్సీలు మరియు ప్రతి అసెంబ్లీ కమిటీ కలిపి 10 ఫ్లెక్సీలు తమ ప్రాంతాలలో వెయ్యాల్సిందిగా తెలియజేస్తున్నాము.

*బందెల గౌతమ్ కుమార్*
*BSP రాష్ట్ర అధ్యక్షులు*
*ఆంధ్రప్రదేశ్*🐘🐘🐘

03/10/2025

*బహుజన్ సమాజ్ పార్టీ, ఆంధ్రప్రదేశ్*

*💐సర్క్యులర్💐*
--------------------------------

బహుజన్ సమాజ్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం 12-10-2025, ఆదివారం , ఉదయం 10 గంటలకు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరుగును.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ కోఆర్డినేటర్, EX-MLC శ్రీ అతర్ సింగ్ రావ్ గారు, మరియు సెంట్రల్ కోఆర్డినేటర్ సురేష్ ఆర్య గారు విచ్చేయుచున్నారు. కావున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్షులు సమావేశానికి హాజరు కావాలని తెలియజేస్తున్నాము.

*బందెల గౌతమ్ కుమార్*
*రాష్ట్ర అధ్యక్షులు*
*బహుజన్ సమాజ్ పార్టీ*
*ఆంధ్రప్రదేశ్* 🐘🐘🐘

        💐మన్నించు...నకిలీ మహత్మ💐 *బూదాల బాబురావు బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు నరసరావుపేట*   💐మోహన్ దాస్...
02/10/2025







💐మన్నించు...నకిలీ మహత్మ💐
*బూదాల బాబురావు బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు నరసరావుపేట*

💐మోహన్ దాస్ కరం చంద్ గాంధీ మహత్ముడేనా ? అసలేవరు ఈయనకి మహత్మ అనే బిరుదును ఇవ్వలేదు. జ్యోతిరావు పూలేనే ఈ దేశంలో ఉన్న ఒకేఒక్క మహత్మ. అప్పటికే ఒక మహత్మ ఉంటే ఠాగూర్ ఈయనన్ని మహత్మ అని ఏందుకు సంబోదించినట్లు?

💐మెట్రిక్ బారిస్టర్ అయిన గాంధీ ,వృషాభానంద అనే వ్యక్తి సహాయంతో ఇంగ్లాండ్ లో చదువుకుని 1890 లో ఇండియాకి వచ్చాడు.
రాజ్ కోట మరియు బొంబాయిలలో ప్రాక్టీస్ మొదలుపెడితే ఒక్క కేసు కూడా సరిగా వాదించలేని ప్లీడరు మన గాంధీ.

💐డైరీ రాసే అలవాటున్న గాంధీ లండన్ డైరీ లోని 20పేజిలు చించి తగలబెట్టకుండా ఉంటే ఈయనగారి లండన్ లీలలు ప్రపంచానికి తెలిసేవి.

💐1893లో దక్షిణాఫ్రికా వెళ్తాడు గాంధీ . ఏందుకో తెలుసా?అక్కడ స్మగ్లింగ్ ముఠా అయిన అబ్దుల్లా &కంపెనీ తరుపున వాదించటానికి బాగా డబ్బులు ఇస్తారనే ఆశతో..

💐టిక్కెట్ తీసుకోకుండా రైలుఏక్కి ,చెకింగ్లో దొరికిపోయి నల్లవాడైనందువల్లే ట్రైన్ నుంచి తోసేసారని కలరింగ్ ఇచ్చుకున్న 23 సం"NRI లాయర్ గారు మన గాంధీ.

💐ఇండియాకి వచ్చి ఇక్కడి కులవ్యవస్థను పూర్తిగా సమర్థించి దాన్ని కొనసాగించటమే నా కర్తవ్యం అని ప్రకటించిన సామాజిక స్మగ్లర్ గాంధీ.

💐*హరిజన* అనే పదం సృష్టించి దళితులను వేశ్యల, దాసీల సంతానంగా శాశ్వత హోదా కట్టబెట్టిన వాడు గాంధీ.

💐39సార్లు నిరహరదీక్షలు చేసిన గాంధీ ఒకేఒక్కసారి ఏర్రవాడ జైల్లో ఆమరణ నిరహర దీక్ష చేసింది ఏందుకో తెలుసా ?మాలమాదిగలకు ఈ దేశంలో అదికారాన్ని శాశ్వతంగా దూరంచేయటానికి.

💐బ్రిటిషర్స్ తో అహింసతో పోరాడాలని దేశాన్ని రెచ్చగొట్టే గాంధీ ,రెండో ప్రపంచ యుద్దంలో భారతీయులను సైనికులుగా యుద్దంలో చేరి వీరోచితంగా పోరాడాలని పిలుపునివ్వటం గాంధీ రెండునాల్కల దోరణి.

💐1932లో స్వరాజ్యం పేరిట యాత్రలు చేసి కోటి ముప్పైరెండు లక్షలు థళితుల కోసం సేకరించి ,ఒక్క అణా కూడా దళితులకోసం ఖర్చుచేయని దళితోధ్ధారకుడు గాంధీ.

💐సుభాష్ చంద్ర బోస్ కాంగ్రెస్ అథ్యక్షుడైతే ఆయన్ని పదవి దించేంతవరకు నిద్రపోకుండా అందరిని బెదిరించిన *ఫామ్ హౌస్* ల వ్యవస్థాపకుడు గాంధీ.

💐అంతేకాక జర్మనీ వెళ్ళిన బోస్ ఇండియాకు వస్తే బ్రిటీషర్స్కీ పట్టించిఇస్తాన్ని అగ్రిమంట్ రాసిచ్చిన వాడు గాంధీ.

💐భగత్ సింగ్,సుఖదేవ్,రాజగురులను లాహోరో జైల్లో ఉరితీస్తుంటే ,కాలాలో నానాపటేకర్ లా భగవద్గీత పఠిస్తూ నోరుమెదపని ముదురు గాంధీ.

💐1947లో ఉన్న 15కాంగ్రెస్ కమిటీలలో 12 కమిటీలు పటేల్ ను ప్రధాని అంటే ,నెహ్రూతో ముడిపడి ఉన్న సరససల్లాపాల కోసం విలాసపురుషుడైనా నెహ్రుని ప్రధానిని చేసిన స్వతంత్ర దేశంలో మొట్టమొదటి *రాజకీయకుట్రల మూలపురుషుడు* గాంధీ.

💐మగవాళ్ళకన్నా ఆడవారినే అంగ రక్షకులు గా పెట్టుకుంటూ *అవ,మను* లాంటి ఏందరో యుక్తవయస్సు ఆడపిల్లలతో నగ్గ్నంగా పుడుకుంటూ,తన బ్రహ్మచర్యాన్ని ఇలా పరీక్షించుకుంటునానన్న బ్రహ్మచారి మన *రంగీలా గాంధీ*
(source:'Rangeela Gandhi@ ky gandhi mahathma thu' book by Dr .L.R.Bali)

💐బాబాసాహెబ్ ను అడుగడునా అవమానిస్తూ ,నారాయణ కాజ్రోకర్ ,జగజ్జీవన్ రాం,రాజాజీ లాంటి బాబాసాహెబ్ దళిత అనుచరులకు పదవుల ఆశచూపి కాంగ్రెస్ లో కలుపుకుని ,నేనే నిజమైన దళితుల ప్రతినిదినని చెప్పుకున్న
*దళితుల అక్రమ వారుసుడు* గాంధీ.

💐ఏ మతానైతే తన చేత అబివృద్ది చేయించుకుందో ,ఏ మతం ముసుగుల్లో దళితులని హీనాతిహీనంగా చూసిందో అదే RSS కార్యకర్త గాడ్సే చేతిలో నేలకొరిగాడు గాంధీ.
💐పాములోడిని పామే కాటేస్తందనటానికి గాంధీ హత్యే నిదర్శనం.💐
........................................
💐బోసినవ్వుల మాటున
దళితులను కాటువేసిన తాత

💐అహింస - అహింస అంటూ దళితులను వీర్యంలేని వీరులుగా మార్చిన జాతిపిత

💐శాంతి - శాంతి అంటూ పాకిస్థాన్ తో ఆరని అగ్నిని మండిచిన అశాంతి పిత

💐బాబాసాహెబ్ ను తుదముట్టించాలను కున్న అజ్ఞాన సమూహ మహాత్మా...మన్నించు

💐గాంధీయిజం లో యిజం లేదని,
గాంధీఫిలాసఫీలో గాంధీనే లేడని
ఈతరం దళితయువకులం చదివేశాం
నీ 200 జయంతి వచ్చేటప్పటికి
నీలిరంగు నిన్ను మసిచేస్తుందనే
ఆనందంతో మన్నించు ...మహత్మ...
జై భీమ్

02/10/2025







అందరికీ జై భీమ్
పత్రిక ప్రకటన 02.10.2025
=======================
ఆంధ్రప్రదేశ్ ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు నరసరావుపేట MIM పార్టీ & జమాఅతె ఇస్లామి హింద్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో నరసరావుపేట పలానాడు విజ్ఞాన కేంద్రం లో ప్రముఖుల సమావేశం

సమావేశానికి అధ్యక్షత వహించిన BSP పార్టీ పలానాడు జిల్లా అధ్యక్షులు బుదలా బాబురావు

ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆంధ్రప్రదేశ్ నాయకులు అబ్దుల్ రెహమాన్ గారు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు దేశంలో బీజేపీ పార్టీ మైనార్టీలను టార్గెట్ చేస్తూ ముస్లిం హక్కులను కాల రాస్తుందని అన్నారు

కులానిర్ములన పోరాట సమితి నాయకులు కృష్ణా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దళిత మైనారిటీలను లక్ష్యం చేసుకొని నల్లచట్టాలను చేస్తూ సమాజాన్ని విచ్చిన్నం చేస్తుందని అన్నారు

MIM పార్టీ పట్టణ అధ్యక్షులు మౌలాలి మాట్లాడుతు ముస్లింపర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో 3వ తారీకు భారత బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని అయితే దసరా పండుగ నీ ద్రుష్టి లో ఉంచుకొని భారత్ బంద్ వలన పండగ ప్రయాణం చేసే వారు ఇబ్బంది పడకూడదని భారత్ బంద్ వాయిదా వేసిందని తదుపరి డేట్ రాగానే దేశ వ్యాప్త నిరసనకు MIM పార్టీ పూర్తిమద్దతూ ఇస్తుందని తెలిపారు

పిడిఎమ్ నాయకులు వెంకటేశ్వరావు మాట్లాడుతూ

బీజేపీ RSS చేతిలో కీలు బొమ్మ లా మారిందని పూటకో చట్టం చేస్తూ దేశంలో మైనార్టీ వర్గాన్ని టార్గెట్ చేస్తుందని కేంద్రంలో ఉన్న కీలక ED EC నీ తన గుప్పెట్లో ఉంచుకొని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ భయపెడుతుందని అన్నారు

పిడుగురాళ్ల వక్ఫ్ పరిరక్షణ కమిటీ నాయకులు లతీఫ్ మాట్లాడుతు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏ నిమిషం లో నిరసన కు పిలుపునిచ్చిన ప్రజలు ప్రజా సంఘాల నాయకులు మద్దతూ గా నిలవాలని కోర్యారు

Mcpi u నాయకులు రెడ్ బాషా మాట్లాడుతు బీజేపీ నుద్దేశించి తెల్ల దొరలపాలన పోయి దేశంలో ఉన్న నల్ల దొరలపాలన వచ్చిందని బీజేపీ ప్రభుత్వనికి చమరాగీతం పాడాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని అన్నారు
ఈ కార్యక్రమం లో JIH పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు హాఫిజ్ మహబూబ్, నరసరావుపేట MIM పార్టీ నాయకులు మౌలాలిMIM జిల్లా అధ్యక్షులు కరీముల్లా సెక్రటరీ ఆరిఫ్ MIM వైస్ ప్రెసిడెంట్ జానీ రియాజ్ మాసూద్ MCPI రెడ్ బాషా BSP బుదాల బాబురావు
బీఎస్పీ సీనియర్ నాయకులు వేల్పుల రాంబాబు
KNPS కృష్ణ PDM నాయకులు వై వెంకటేశ్వర్లు నల్లపాటి రామారావు మైనార్టీ నాయకులు మునాఫ్ టీడీపీ నాయకులు రఫీ JAC నాయకులు జిలాని మాలిక్ తదితరులు పాల్గొన్నారు

        దశ + హరా = దశరా (దసరా)సేకరణ *బూదాల బాబురావు బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు నరసరావుపేట*  అంటే పది ...
02/10/2025







దశ + హరా = దశరా (దసరా)
సేకరణ
*బూదాల బాబురావు బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు నరసరావుపేట*

అంటే పది మంది ఓడిపోయారని అర్థం. హరించుకు పోయారని కూడా చెప్పుకోవచ్చు. ఎ వరు ఆ పదిమందీ? అసలు విషయం చెప్పకుండా దశకంఠుడనే రావణుడు చనిపోయాడు గనుక, ఇది దశహరా అని చెప్తారు. రావణుడు రామాయణంలో ఓ కల్పిత పాత్ర. రాముడు ఎలాగైతే ఓ కల్పిత పాత్రో రావణుడు కూడా అలాగే ఓ కల్పిత పాత్ర. ఒక కావ్యంలో ఒక పాత్ర చనిపోతే పండగలేమిటీ? అర్థం లేకుండా? దాని ఆధారంగా రావణుడి ప్రతిమను పెద్ద ఎత్తున తగలబెట్టడం కొందరు చేస్తే, దానికి విరుద్ధంగా రాముడి ప్రతిమను మరికొందరు తగలబెడుతున్నారు. పైగా, వీటికి రావణ్‌లీలా / రామ్‌లీలా అని పేర్లు పెట్టుకోవడం అవసరమా? భ్రమల్లో బతికే వారికి బాగా ఉంటుందేమో గానీ, వాస్తవాలు తెలుసుకోదలుచుకుంటే అవి వేరే విధంగా ఉంటాయి.

ఈ దేశంలో మౌర్య సామ్రాజ్యన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. ఆయనే ఆ వంశంలో మొదటి రాజు. అలాగే చివరి రాజు బృహదత్తు మౌర్యం. వీరి మధ్య మొత్తం పది మంది మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఇక్కడ చివరి రాజు బృహదత్తుడి దగ్గర మోసపూరితంగా ఒక బ్రాహ్మణుడు సైన్యాధ్యక్షుడయ్యాడు. అతని పేరు పుష్యమిత్ర శృంగుడు. అదను చూసి, పుష్యమిత్రుడు రాజు బృహదత్తు మౌర్యను హత్యచేస్తాడు. దానితో పది తరాలుగా వస్తున్న మౌర్యవంశం - వారి సామ్రాజ్యం పతన మయ్యాయి. అసలు దశహరా అంటే ఇది. దీన్ని కప్పి పుచ్చడానికి పదితలలున్న రాక్షస రాజును సృష్టించి కథలు అల్లారు. పది తరాలుగా వస్తున్న మౌర్యవంశం పతనమైందనీ, తమ శృగుల రాజ్యం స్థాపించబడిందనీ పుష్యమిత్ర శృంగుడు తన బ్రాహ్మణ వర్గీయులతో చేసుకున్న విజయోత్సవమే దశహరా. మౌర్య చక్రవర్తులంతా బౌద్ధాన్ని అనుసరించిన వారు. మౌర్యుల కాలంలో బ్రాహ్మణుల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శ్రార్ధకర్మలు ఉండేవి కావు. హింసాత్మకంగా బలులు ఇచ్చేవారు కాదు. విగ్రహారాధన, పూజలు, అర్చనలు ఉండేవి కావు. ఒళ్ళు వంచి కష్టపడి పనిచేయడం చేతకాని బ్రాహ్మణులకు గడ్డుకాలం దాపురించింది. ఎలాగైనా బౌద్ధాన్ని నాశనం చేయాలి. మౌర్య సామ్రాజ్యాన్ని పడగొట్టాలి. తమ వైదిక ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి... కూర్చుని తింటూ ఉండాలి! అని కుట్రలకు, కుతంత్రాలకు పూనుకున్నారు. హింసకు కూడా వెనుకాడలేదు. రాజు పుష్యమిత్ర శృంగుడు - బౌద్ధ భిక్షువుల తలలు నరికి తెమ్మన్నాడు. ఒక్కొక్క తలకు వంద వరహాలిస్తానని కూడా ప్రకటించాడు. ఇకనేం? బౌద్ధ భిక్షువులు దొరికినవారు దొరికారు. లెక్కలేనంత మంది నరికి చంపబడ్డారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపొయ్యారు.

దసరా రోజు జమ్మి చెట్టును దర్శించి, దాని ఆకు తీసుకుని బంధుమిత్రుల్ని కలవడం ఆచారంగా వస్తోంది. దానికి చెప్పిన కథ ఏమిటీ? మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలు జమ్మిచెట్టు మీద పెట్టారని, అవి ఇతరులకు, శవంలాగా కనిపిస్తాయని చెపుతారు. అవి తీసుకుని, మహాభారత సంగ్రామానికి పాండవులు బయలుదేరి వెళ్ళారని చెపుతారు. అసలు చెట్టుమీద శవం కనబడితే ఎవడూ పైకెక్కి ఏమిటీ అని చూడడా? ఆనాటి ఆ ప్రజలు అంత పిరికివారా? సరే, ఆ విషయం వదిలేద్దాం. దశహరా అని ఒకటి రామాయణం కథ చెప్పారు. మరొకటి భారతంలోది చెప్పారు. అంటే ముక్కలు ముక్కలుగా అతుకుల బొంతలాంటి కథలు చెప్పడమేనా మనువాదుల పనీ? సరే - దీని గూర్చిన వాస్తవాలేమిటీ? చరిత్ర ఏం చెపుతుందో చూద్దాం. మొదట క్రూరుడిగా ఉన్న అశోకుడు కళింగను ఆక్రమించుకోవడానికి అతి భీభత్సంగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధం అతనిలో గొప్ప మార్పు తెచ్చింది. అంతర్మధనానికి లోనయ్యాడు. యుద్ధంతో మానవాళికి జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్నాడు. బుద్ధుడి బోధనలకు ఆకర్షితుడయ్యాడు. ఫలితంగా యుద్ధం ముగిసిన పదిరోజుల తర్వాత సరిగ్గా దశమి రోజున బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించాడు. విజయం సాధించినందుకు ఆ దశమి విజయ దశమి అయ్యింది. ఆ రోజు తన రాజ్యమంతా విజయోత్సవాలు, వేడుకలు చేసుకోవాలి. కానీ, అందుకు భిన్నంగా అదే దశమి రోజున బుద్ధ విగ్రహం పాదాల దగ్గర తన ఆయుధాలు పెట్టి అశోకుడు అహింసా సిద్ధాంతాన్ని స్వీకరించాడు. బౌద్ధ గురువు మొగలి పుత్త తిస్స ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధం వ్యాపించడానికి అశోకుడు చేసిన విశేషమైన కృషి ఏమిటో మనకు తెలుసు. దేశ వ్యాప్తంగానూ, విదేశాల్లోనూ ఉన్న బౌద్ధ విగ్రహాలు, స్థూపాలు, ఆరామాలే ఆనాటి వాస్తవాల్ని ఈ నాటికీ వివరిస్తూనే ఉన్నాయి. అసలు విజయ దశమి రోజున జరిగింది ఇదయితే - వైదిక సంప్రదాయ వాదులేం చేస్తున్నారూ? రక్తం తాగుతున్న దేవతా(స్త్రీ) మూర్తిని పెట్టుకుని, దానికి ఎదురుగా జంతువుల్ని బలి ఇస్తున్నారు. ఆ దేవతా మూర్తి చేతిలో కూడా ఖడ్గం ఉంటుంది. అది రక్తసిక్తమైందన్నట్టుగా ఆ బొమ్మ ఖడ్గానికి కూడా ఎరుపురంగు పూస్తారు. అంటే హింసను ప్రేరేపించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారన్న మాట! గొర్రె పిల్ల మెడను ఒకడు పంటితో కొరికి చంపడం, ఆ రక్తంతో దేవతా మూర్తులకు అభిషేకాలు చేయడం ఇప్పటికీ కొనసాగుతున్న ఆచారాలు. ఇలాంటివి ఇంకా అవసరమా? అని జనం ఆలోచించాలి కదా? మనం అర్థం చేసుకోవా ల్సింది ఏమంటే... ''శాంతిని బోధిస్తున్న బౌద్ధానికి వ్యతి రేకంగా బ్రాహ్మనిజం చేస్తున్నదే ఈ విజయదశమి'' అని!

బౌద్ధాన్ని నాశనం చేయడానికి చేసిన ఎన్నో కుతంత్రాలలో భాగమే మనుస్మృతి రచన! దాని ప్రకారమే రాజును, రాజ్యాన్ని తమ చెప్పు చేతలలో ఉంచుకుని తమ స్థానాన్ని రాజగురు స్థానంలో లేదా పండిత / పూజారి స్థానాల్లో మహౌన్నతంగా స్థిరపరుచుకున్నారు - వైదిక మతాచార్యులు! మిగతా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, వారి రెక్కల కష్టాన్ని దోచుకు తింటూ శతాబ్దాలుగా కాలం గడుపుతూ వస్తున్నారు. ఈ విషయాలు పూర్తిగా అర్థం చేసుకున్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశాన్ని మౌర్యులు, నాగవంశ పాలకులు పరిపాలించారు. ఈ నాగజాతిని కాపాడింది బుద్ధుడే. వారే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధాన్ని ప్రచారం చేశారు. నాగజాతి వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతం నాగాపూర్‌. అక్కడ ప్రవహించే నది నాగానది. ఇలాంటి చారిత్రక అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన తర్వాత డాక్టర్‌ అంబేద్కర్‌ 1956లో అక్టోబర్‌ 14న దీక్షభూమి, నాగ్‌పూర్‌లో విజయదశమిరోజు బౌద్ధం స్వీకరించారు. అంటరానితనం అంతరించాలనీ, మనుషులందరికీ సమానస్థాయి, హక్కులు ఉండాలన్నది ప్రథానంగా ఆయన కోరుకున్నారు. ఆయన స్వీకరించడమే కాకుండా, ఆయన అనుయాయుల్ని ఆరులక్షల మందిని బౌద్ధంలోకి తీసుకుపోయారు. ఈ కార్యక్రమమంతా భదంత్‌ చంద్రమణి మహాథేరో, భంతే ప్రజ్ఞాతిస్స, యం.సంఘ్ రతన్‌ మహాథేరో ఇంకా ఇతర బౌద్ధభిక్కుల ఆధ్వర్యంలో జరిగింది. అంబేద్కర్‌ మరణం తర్వాత కూడా అధిక సంఖ్యలో ఆయన అనుచరులు బౌద్ధం స్వీకరిస్తూ వచ్చారు. బౌద్ధానికి ఈ దేశంలో ఒకప్పుడు ఉన్న ఆదరణ ప్రస్థుతం లేకపోవచ్చు. కానీ, ఆధునిక కాలంలో కూడా అంతరించిపోకుండా స్థిరంగా కొనసాగుతూ ఉంది. మతాల పేరుతో రాజకీయ నాయకులు చేస్తున్న దుశ్చర్యలకు విసిగిపోయి మానవ వాదులంతా బౌద్ధం వైపు ఆకర్షితులవుతున్నారు. అధికారికంగా బౌద్ధం స్వీకరించక పోయినా, తమ ఆలోచనా ధోరణిలో బుద్ధుడి బోధనల్ని బలంగా నిలుపుకుంటున్నారు.

వైజ్ఞానిక స్పృహ కోసం తహతహలాడుతున్న హేతువాదులంతా బుద్దుడి బోధనలకు ప్రభావితులవు తున్నారు. ఒక చారిత్రక పురుషుడి ప్రభావంలో ప్రపంచం ఇంతగా పడిందంటే... ఇంకా పడుతూనే ఉందంటే అది మామూలు విషయం కాదు. కొన్ని దేశాల్లో మత కేంద్రాల్ని, ప్రార్థనా స్థలాల్ని మూసేసి హౌటళ్ళకు, క్లబ్బులకు అద్దెకు ఇస్తున్నారు. మత రహితులుగా, మానవ వాదులుగా బతకాలనుకుంటున్నారు. బ్రాహ్మనిజం సమాజంలో అసమానత్వాన్ని ప్రభోదిస్తే, బౌద్ధం సమానత్వం కోసం పాటు పడింది. అందువల్ల మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే వారంతా ఈ వైపుకు రావడం తథ్యం!
మొఘలుల కాలం నుండి, బ్రిటిషు కాలం నుండి హిందూ మతస్థులంతా ముస్లిం, క్రైస్తవ మతాల్లోకి ఎందుకు మారారూ? హిందూ మతంలోని అమానవీయ అంశాలకు విసిగి, వేసారి మారారు అనేది నిజం! ప్రపంచంలో ఎక్కడా లేని సతీసహగమనాన్ని ఎలా సమర్థించుకుంటారూ? స్త్రీలను నిమ్నవర్గాల్లో కలిపి, వారికి చదువూ, స్వేచ్ఛా లేకుండా ఎందుకు చేశారు? వారి శ్రమను ఎందుకు దోపిడీ చేశారు? జంతువుల కన్నా హీనంగా - అంటరాని తనాన్ని ఎందుకు పాటించారు? ఇలాంటి అతినీచమైన పద్ధతులు ఉండడం వల్లనే, వాటిని తప్పించుకోవడానికి కొందరు ఇతర మతాల్లోకి పారిపొయ్యారు. 'ధర్మం' - పేరుతో ఆలయాలు కట్టే వాళ్ళు - పునరుద్ధరించేవాళ్ళు పునరాలోచించుకోవాలి. వాళ్ళు పెంచేది బిచ్చగాళ్ళ సంఖ్యే తప్ప మరేమీ కాదు. జీవితకాలమంతా అట్టడుగు వర్గాల ప్రయోజనం కోసం నిలబడ్డ వాళ్ళు సైతం, ఈ రోజు ప్లేటు ఫిరాయించి మనువాద స్వాముల కాళ్ళమీద పడి, భజనలు చేస్తూ దిగజారిపోతున్నారు.

బుద్ధుడి ప్రభావాన్ని కాదనలేకే కదా అతణ్ణి తమ కాల్పనిక దశావతారాల్లో చేర్చుకున్నారు? ఒక చారిత్రక పురుషుడైన బుద్ధుడి ఆహార్యం, జీవితాంశాలు తీసుకునే కదా పురాణ పురుషుడైన రాముడి పాత్రకు రూపకల్పన చేసుకున్నారు?
సాధారణ శకానికి పూర్వం (బిసిఈ) ఆరవ శతాబ్దం నుండి సాధారణ శకం (సీ.ఈ) లోని పదిహేనవ శతాబ్దం వరకు సుమారు రెండువేల ఏండ్లు ఈ దేశంలో బౌద్ధం విలసిల్లింది. తర్వాత కాలంలో దాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఒకప్పటి శృంగులు, తర్వాత కాలాలలో త్రిమతా చార్యులు అంటే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వారి వారి అనుయాయులు కొన్ని శతాబ్దాలుగా అహేతుకమైన, అసంబద్ధమైన దేవీ దేవతల మహిమలు ప్రచారం చేసి సమాజాన్ని మూఢత్వంలోకి లాగారు. ఇప్పుడు అందులోంచి బయటపడటం జనానికి చాలా కష్టంగా ఉంది. నిజాలు తెలుసుకుని జనం ఎక్కడ వివేకవంతులవుతారోనని ప్రస్థుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రజల సొమ్మును ఆలయాలకూ, విగ్రహాలకూ ఖర్చుపెడుతున్నాయి. ఇది మనం చూస్తున్నదే! దీనివల్ల దేశం వెనకడుగులు వేయడమే తప్ప, ముందడుగు వేసినట్టు ఎంత మాత్రమూ కాదు!

- డాక్టర్‌ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.

        బుస కొడుతున్న కులవివక్ష!         -ప్రజాశక్తి సంపాదకీయం ‘కసిరి బుసకొట్టు నాతని గాలిసోక.. నాల్గు పడగల హైందవ నాగరాజ...
25/09/2025







బుస కొడుతున్న కులవివక్ష!
-ప్రజాశక్తి సంపాదకీయం

‘కసిరి బుసకొట్టు నాతని గాలిసోక.. నాల్గు పడగల హైందవ నాగరాజు’…అంటూ సమాజంలో ఉన్న కుల దురహంకారాన్ని అనేక దశాబ్దాల క్రితమే నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ఈసడించాడు. నాటి బుసలు.. నేడు కాలకూట విషంగా మారి…. ప్రాణాలు తీసే స్థాయికి పెచ్చుమీరడం సిగ్గుచేటు. మన రాష్ట్రంలో ఇలాంటి దాడులు తరచూ చోటుచేసుకుంటుండగా, బిజెపి పాలిత రాష్ట్రాలు దేశంలోనే దళితులపై దాష్టీకాల్లో ముందువరసలో ఉన్నాయి.

సమీప బంధువు అంత్యక్రియలకు వెళ్లి వస్తూ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరులో ఓ ఇంటి అరుగుపై ఓ దళిత వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయాడు. మనిషిని మనిషిగా చూడలేని పెత్తందారీ కులానికి చెందిన ఆ ఇంటి యజమాని బాధితుడిని కర్రతో కొట్టడంతోపాటు మరిగే నూనె పోసేశాడు. మనం ఏ సమాజంలో ఉన్నాం… అంటూ భయపడేలా చోటుచేసుకుంటున్న ఇలాంటి మరిన్ని ఘటనలూ మన రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. దళిత యువకుడు, బిసి యువతి ప్రేమించుకుని ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.

ఇటీవల ఆ యువకుడి తల్లి తన స్వగ్రామానికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెత్తందారులు యువతి కుటుంబ సభ్యులను రెచ్చగొట్టారు. యువకుడి తల్లిపై దాడి చేయకపోతే గ్రామ బహిష్కారం చేస్తామని హెచ్చరించారు. పెత్తందారులు, యువతి కుటుంబ సభ్యులు కలిసి యువకుడి తల్లిని చెట్టుకు కట్టేసి పాశవికంగా కొట్టారు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం కల్లుకూటలో ఈ అఘాయిత్యం జరిగింది. అగ్రవర్ణ బాలికను ప్రేమించాడని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవంలో దళిత బాలుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు.

ఇక అదే జిల్లాలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ రంగరాయ కళాశాలకు చెందిన దళిత ప్రొఫెసర్‌పై దాడి చేశారు. బీహార్‌లోని నవాడా జిల్లాలో దళితులు నివాసముంటున్న 21 ఇళ్లకు ఇటీవల నిప్పు పెట్టారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి నేరాలకు అంతేలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్కు అభివృద్ధి పేరిట రాంపూర్‌ జిల్లా సిలారు బరగామ్‌లో లాఠీఛార్జి, కాల్పులు జరిపి పదో తరగతి చదువుతున్న దళిత విద్యార్థిని పొట్టనపెట్టుకుంది.
కేంద్ర, సామాజిక న్యాయం, సాధికార శాఖ 2022కు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నివేదిక మరిన్ని వాస్తవాలను కళ్లకు కట్టింది.

ఆ ఏడాది దళితులపై దాష్టీకాలకు సంబంధించి 51,656 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. బిజెపి పాలనలోని ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 12,287 కేసులతో.. 23.78 శాతం నేరాలతో యోగి పాలనలోని ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానాన్ని వెలగబెట్టింది. 8,661 కేసులు, 16.75 శాతం నేరాలతో రాజస్థాన్‌, 7,732 కేసులతో 14.97 శాతం నేరాలతో మధ్యప్రదేశ్‌ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత స్థానాల్లో బీహార్‌, ఒడిశా, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే 81 శాతం కేసులు నమోదయ్యాయి. ఇక మన రాష్ట్రం 2,190 కేసులతో ఏడో స్థానంలో ఉంది. ఎస్‌టిలపై వేధింపుల కేసులు దేశవ్యాప్తంగా 8,330 నమోదు కాగా, 379 కేసులతో రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉంది.

ఉమ్మడి కడప జిల్లాలోని 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 15 గ్రామాలు సహా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అత్యధికంగా ఎస్‌సి, ఎస్‌టిలపై వేధింపులు జరుగుతున్నాయి. ఈ కేసులలో నిందితులు దర్జాగా తిరుగుతుండగా, బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. మొత్తంగా దళితులకు సంబంధించి 97.7 శాతం కేసులు 13 రాష్ట్రాల్లోనూ, అవే రాష్ట్రాల్లో ఎస్‌టిలపై 98.91 కేసులు నమోదయ్యాయి. ఈ విషయాలపై పెదవివిప్పని బిజెపి అగ్రనేత అమిత్‌షా… గురివిందగింజ తన నలుపెరగదన్నట్టు ఇతర పార్టీల దళిత వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నారు.

దళితులు, గిరిజనులు, మైనారిటీలపై నిత్యం విషం చిమ్ముతూ… సమాజంలో చీలికలు సృష్టించి లబ్ధి పొందాలని కాచుక్కూర్చున్న సంఘపరివార్‌, బిజెపి శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పాలి. ‘అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నీ మెలగవలెనోయి…మతం వేరైతేను యేమోయి.. మనసు వొకటై మనుషులుంటే..’ అన్న గురజాడ స్ఫూర్తితో ముందడుగు వేయడమే మన కర్తవ్యం.

Address

Bhongir

Website

Alerts

Be the first to know and let us send you an email when ఆంధ్రప్రదేశ్ BC సమన్వయ కమిటీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share