Mithra Fans club

Mithra Fans club sri DA Mithra songs of legend telugu singer
sri ghantasala master.all the melodious hit songs of th
(1)

15/08/2026

పాడవోయి భారతీయుడా...
ఆడి పాడవోయి విజయ గీతికా...
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
చిత్రం - వెలుగు నీడలు (1961)
రచన - శ్రీ శ్రీ
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు
గానం - ఘంటసాల - పి సుశీల

స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్ద కాలం తర్వాత సమాజంలోని లోపాలను ఎత్తిచూపుతూ దేశ నిర్మాణానికి పిలుపునిచ్చిన విశిష్టమైన గీతం. ఈనాటికీ జాతీయ వేడుకల్లో కీలకమైన ఉత్తేజకరమైన గీతం...

ఏ తరానికి అయినా భారతదేశ పరిస్థితులకు ఈ పాట సరిగ్గా సరిపోతుంది. ప్రజలలో చైతన్యం రానంతవరకు మన దేశ పాలకులు అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు నడుపుతూనే ఉంటారు...

కొన్ని దశాబ్దాల క్రితమే ఈ దేశ భవిష్యత్తు ఊహించిన మహా కవి కి జోహార్లు...🙏

చంద్ర తేజాలయ మ్యూజిక్ అకాడమీ మరియు సృష్టి ఆర్ట్స్ అభినందనలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ డి ఏ మిత్ర గారు, చంద్రతేజ, బాల కామేశ్వరరావు, శ్రీమతి సురేఖ మరియు శశికళ స్వామి ఆలపించిన గీతం ఈనాటి స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా విందాం....
This video is posted for group entertainment only.

Big shout out to my newest top fans! 💎 Sandhya Rani Gudipati, Butchaiah Sarma Telikepalli, Rama Prada, Pawar As, Vempara...
09/08/2026

Big shout out to my newest top fans! 💎 Sandhya Rani Gudipati, Butchaiah Sarma Telikepalli, Rama Prada, Pawar As, Vemparala Suryanarayana

Drop a comment to welcome them to our community, fans

05/08/2026

"చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది...
దాని జిమ్మ దియ్య...
అందమంతా చీరలోనే ఉన్నది..."

చిత్రం - బంగారు బాబు (1973)
రచన - ఆచార్య ఆత్రేయ
సంగీతం - కె వి మహదేవన్
గానం - ఘంటసాల - సుశీల

అందమైన చిన్నది అంతకంటే అందమైన చీర కట్టుకున్నప్పుడు, ఆ అందమంతా చీరలోనే ఉన్నదని, అతని మనోభావాలను, పాట రూపంలో పాడుతుంటే, కొంగులు కలపమని ఆ చిన్నది అడుగుతుంది... అది ఆత్రేయ గారి కలం కదా అందులో చిందులు తప్పవు కదా మరి..💃🕺

మారుమూల ప్రాంతాల్లో నివసించే ఒక సామాన్యునికి, ప్రేమ అంటే ఏంటో తెలియని పిచ్చివాడికి, ప్రేమ రుచిని తెలియజేసి, ఇల్లాలి స్థానం కోరుకునే కథానాయిక మనసులోని భావాలకు ఒక అపురూప చిత్రీకరణ ఇచ్చారు ఆత్రేయ👌... అందులో మామ సంగీతం🎷🎺🥁... ఎవరినైనా నాట్యం చేయిస్తుంది💃... అది అక్కినేని, వాణీశ్రీ అయితే ఆ పాట కనులకు విందే కదా...🥰👏

"మధుర స్వర కంఠీరవ" మన అభిమాన గాయకులు, శ్రీ డి ఎ మిత్ర గారు మరియు శ్రీమతి మణి శాస్త్రి గార్ల స్వర విన్యాసం మళ్ళీ మనల్ని ఐదు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తుంది👩‍❤️‍👨... Enjoy friends...🥰
This video is posted for group entertainment only....

27/07/2026

విధి ఒక విష వలయం..
విషాద కథలకు అది నిలయం..😥

చిత్రం -- మాతృదేవత(1969)
రచన -- సి నారాయణ రెడ్డి
సంగీతం -- కె వి మహదేవన్
గానం -- ఘంటసాల

మనసులోని భావాలను కళ్ళకు కట్టినట్లు రాయగల దిట్ట సి నారాయణ రెడ్డి గారు.. భార్యా పిల్లలను తలుచుకుంటూ విధి చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకుంటూ విషాదాన్ని పలికించారుఘంటసాల గారు.. తన నటనతో ఆ పాటకు జీవం పోసారు ఎన్ టి ఆర్..🌹🙏🌹

పువ్వు చాటున దాగిన ముల్లు నాటే దాకా తెలియదు.. మన చుట్టూ ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళెవరో తెలుసుకోలేము.. జీవిత సత్యాలను ఉదాహరణలతో అందిస్తారు సినారె..✍️

ఘంటసాల గారి పాటలకు వారధిలా నిలిచిన మిత్ర గారు ఆలపించిన మరో వేదనా భరిత గీతం..🌹🙏🌹
This video is posted for group entertainment only.

20/07/2026

చిత్రం : భలేరంగడు
గానం
మన అభిమాన గాయకుడు శ్రీ డి. ఏ. మిత్ర గారు శ్రీమతి మణి శాస్త్రి గారు USA

13/07/2026

ఎనలేని ఆనంద మీరేయి...
మనకింక రాదోయి ఈ హాయి...

చిత్రం - పరమానందయ్య శిష్యుల కథ.
(1966)
రచన - వెంపటి సదాశివ బ్రహ్మం
సంగీతం - ఘంటసాల
గానం - ఘంటసాల - ఎస్ జానకి

ఘంటసాల గారి గంభీరమైన మధుర స్వరం, ఎస్ జానకి గారి కోమలమైన గాత్రం ఈ పాటకు ప్రాణం పోసాయి... సంగీత పరంగా క్లాసికల్ టచ్ తో సాగే ఈ మెలోడీ సాంగ్ పాత తరం తెలుగు సినిమా శృంగార గీతాలలో ఒక మైలురాయిగా నిలుస్తుంది...🌹🌹🌹

ఎన్ టి ఆర్, కె ఆర్ విజయ ల మీద చిత్రీకరించిన ఈ గీతం వింటూ ఉంటే పరమానందంగా ఉంటుంది. అరుదుగా వినిపించే గీతం... 🥰🙋

'స్వరసిద్ధ గాత్ర' శ్రీ డి ఎ మిత్ర గారు, నందీ అవార్డు గ్రహీత శ్రీమతి సురేఖ మూర్తి గారు ఎంతో మధురంగా ఆలపించిన గీతం ఈరోజు గాన కోకిల శ్రీమతి ఎస్ జానకి గారికి నివాళిగా అందిస్తున్నాము.
This song is posted for group entertainment only...

This video is posted for group entertainment only.

07/07/2026
18/06/2026

హలో హలో ఓ అమ్మాయి..
పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో
వేడుకొనడు అబ్బాయి🧑‍🤝‍🧑

చిత్రం -- ఇద్దరు మిత్రులు (1961)
రచన -- ఆరుద్ర
సంగీతం -- సాలూరి రాజేశ్వరరావు
గానం -- ఘంటసాల - సుశీల
నటీనటులు -- అక్కినేని - ఇ వి సరోజ

అమ్మాయి అలగటం అబ్బాయి వేడుకోవడం మన పురాణ కాలం నుండి జరుగుతున్నదే.. ఆదినుండి ఆడవారిదే పైచేయి.. 🌿🌼🌿 దాన్ని మార్చి ఆరుద్ర గారు లడాయి చేసే స్త్రీ జాతి రాక మానదు రాజీ కి అంటూ, మళ్ళీ అంతలోనే గెలుపు కోసం మగవారు కాళ్ల బేరాలాడక పోరు అని రాశారు...✍️

ఆద్యంతం హుషారుగా సాగే ఈ పాటలో అక్కినేని, ఇవిసరోజల హావభావాలతో, చిరు తగాదాలతో నయనానందకరంగా ఉంటుంది..😍 అక్కినేని - ఘంటసాల కలయికలో మన లాంటి అభిమానులకు దొరికిన అపురూప కానుక..🥰

మన అభిమాన గాయకులు శ్రీ మిత్ర గారు, గీతాంజలి గారు వంశీ రామరాజు గారి ప్రోగ్రాం లో అద్భుతంగా ఏకధాటిగా ఆలపించిన 51 పాటల్లో ఒక చక్కని హుషారైన గీతం..💃🕺
This video is posted for group entertainment only.

Big shout out to my newest top fans! 💎 Sandhya Rani Gudipati, Butchaiah Sarma Telikepalli, Sivaprasad Yaddanapudi, Rama ...
17/06/2026

Big shout out to my newest top fans! 💎 Sandhya Rani Gudipati, Butchaiah Sarma Telikepalli, Sivaprasad Yaddanapudi, Rama Prada, Trinadha Naidu Mudili, Deshaveni Shankar, Durgarao Samala, Lakshminarayana Bhuvanagiri, Vemparala Suryanarayana

Drop a comment to welcome them to our community, fans

11/06/2026

నీలో నేనై..నేనై..
నాలో నీవై..నీవై..💕

చిత్రం -- ఆలీబాబా 40 దొంగలు (1970)
రచన -- సి నారాయణ రెడ్డి
సంగీతం -- ఘంటసాల
గానం -- ఘంటసాల, సుశీల

ఆనాటి పాత పాటలు మనోరంజకంగా మనసుకు ఉత్తేజకరంగా ఉంటాయి..🙋 వలపు లో, జీవితంలో ఎన్ని మలుపులొచ్చినా ముందుకు సాగాలనే చక్కటి సందేశం నిండి ఉన్న గీతం..👌 ఘంటసాల గారి సంగీతం లో సుశీల గారితో కలిసి పాడిన యుగళ గీతం.. గుర్రపు డెక్కల చప్పుడు ఈ పాటలో ప్రత్యేకంగా ఉంటుంది..👏😊

మానసికంగా అలసిపోయినప్పుడు ఇలాంటి పాటలు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.. నందీ అవార్డు గ్రహీత శ్రీ మతి సురేఖ మూర్తి గారితో ఒక ప్రోగ్రాం లో మిత్ర పాడిన ఈ పాట మన సభ్యుల కోసం... ఆనందించండి ఫ్రెండ్స్...
🌷🌿🌷
చక్కటి వీడియో మిక్సింగ్ చేసిన ఉమాశంకర్ జిండే ( బెంగళూరు) గారికి హృదయపూర్వక అభినందనలు... ధన్యవాదాలు..🙏💐💐💐

This video is posted for group entertainment only...

Address

Rajamahendravaram

Telephone

+919440332621

Website

Alerts

Be the first to know and let us send you an email when Mithra Fans club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mithra Fans club:

Shortcuts

Share